Priyamani : దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ప్రియమణి 2003లో కేవలం 17 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటిస్తూ, తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. స్టార్ హీరోలకు జోడీగా నటించి క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ముఖ్యంగా తెలుగులో పెళ్లైన కొత్త, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.
ఇటీవల నారప్ప, భామాకలాపం, విరాట పర్వం వంటి సినిమాల్లో నటించి తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకుంది. హిందీ సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టి, జవాన్, మైదాన్ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. త్వరలోనే తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న జన నాయగన్ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tollywood : మా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్‌లో ఇప్పటికీ కలర్ బైయాస్, ప్రాంతీయత వంటి అంశాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని ప్రియమణి ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. “కొంతమంది నన్ను సినిమాల్లో కాస్ట్ చేస్తూ, ‘ఈ క్యారెక్టర్ సౌత్ ఇండియన్ కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాం’ అని స్పష్టంగా చెప్పారు. మేం నిజంగానే సౌత్ ఇండియాకు చెందినవాళ్లమే, అనర్గళంగా పలు భాషలు మాట్లాడగలం. నార్త్ యాక్ట్రెస్‌లా తెల్లగా ఉండకపోవచ్చు కానీ అందంగా ఉంటామని ధైర్యంగా చెప్పగలం. చర్మరంగం ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌లో పాత్రలు ఇస్తూ రంగు, ప్రాంతం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నటీనటుల నైపుణ్యాన్ని చూసే దృష్టి చాలా సార్లు తగ్గిపోతుంది” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రియమణి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అనేక మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఈ విషయంపై తెరపైకి రాబట్టినందుకు అభినందనలు తెలుపుతున్నారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ను చెస్ ఆటగా వర్ణించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది