Premalu OTT Release మలయాళంలో సూపర్ హిట్టైన ప్రేమలు సినిమా రీసెంట్ గా తెలుగులో రిలీజైంది. మార్చి 8న రిలీజైన ప్రేమలు తెలుగు వెర్షన్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేయడంతో బజ్ పెరిగింది. తెలుగులో హిట్టైన తర్వాత తమిళంలో కూడా ఈ మూవీని రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మార్చి 29న లాక్ చేశారు. ప్రేమలు ఓటీటీ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకున్నాయి. అసలైతే మార్చి 29న ఓటీటీ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కూడా సినిమా ఇంకా తెలుగు తమిళ భాషల్లో ఆడుతుండటం వల్ల సినిమా ఓటీటీ రిలీజ్ ని వాయిదా వేశారు. ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది నిరాశే అని చెప్పొచ్చు.
ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు షాక్ ఇస్తూ ఏప్రిల్ 12న ప్రేమలు డిజిటల్ రిలీజ్ అని చెబుతున్నారు. థియేట్రికల్ సూపర్ హిట్ అయిన ప్రేమలు ఓటీటీలో కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందని చెప్పొచ్చు. ప్రేమలు సినిమాతో ఆ సినిమా హీరోయిన్ మమితా బైజుకి సూపర్ క్రేజ్ ఏర్పడింది.
Also Read : Nani Srikanth Odela : లీడర్ అయ్యేందుకు ఐడెంటిటీ అవసరం లేదు.. నాని దసరా కాంబో ఫిక్స్..!