Mamitha Baiju : ఏకంగా విజయ్ సినిమాలో ఛాన్స్.. ప్రేమలు బ్యూటీ లక్కు మాములుగా లేదుగా..

మలయాళంలో పలు సినిమాలు చేసినా అంతగా రాని గుర్తింపు ఒక్క ప్రేమలు సినిమాతో వచ్చింది మమిత బైజుకి.

Published By: HashtagU Telugu Desk
Mamitha Baiju gets Chance in Vijay Last Movie

Mamitha Baiju

Mamitha Baiju : తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇటీవలే తన లాస్ట్ సినిమా ప్రకటించాడు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై H వినోద్ దర్శకత్వంలో విజయ్ లాస్ట్ సినిమా తెరకెక్కనుంది. ఇది విజయ్ కు 69వ సినిమా. తాజాగా నేడు ఈ సినిమాలో నటించేవాళ్లని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నట్టు, పూజాహెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

మలయాళంలో పలు సినిమాలు చేసినా అంతగా రాని గుర్తింపు ఒక్క ప్రేమలు సినిమాతో వచ్చింది మమిత బైజుకి. మలయాళంలో హిట్ అయిన ప్రేమలు సినిమా ఆ తర్వాత తమిళ్, తెలుగులో కూడా రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో మమిత క్యూట్ నటనకు, డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యువత అంతా ఆమె ఫ్యాన్స్ అయిపోయారు. ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకుంది మమిత బైజు. ఇప్పుడు ఏకంగా విజయ్ లాస్ట్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడంతో ఆమె లక్కు మాములుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

 

Also Read : Trivikram : పవన్‌తో పాటు త్రివిక్రమ్ కూడా తిరుమలలోనే.. దర్శనానంతరం త్రివిక్రమ్‌తో కలిసి బయటకి వచ్చిన పవన్ కూతుళ్లు..

  Last Updated: 02 Oct 2024, 05:19 PM IST