Site icon HashtagU Telugu

Prashanth Varma : బాలయ్యకు హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..!

Prashanth Varma Big Hand to Balakrishna Prashanth Varma Big Hand to Balakrishna

Prashanth Varma Big Hand to Balakrishna

నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుందని ప్రకటించారు. ఐతే ఈ సినిమా అసలైతే డిసెంబర్ 5న మొదలవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల కాలేదు. ఐతే దీని వెనక ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కారణమని తెలుస్తుంది. మోక్షజ్ఞ కోసం పురాణాలకు సంబందించిన కథ రెడీ చేసిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో సినిమా అనేసరికి ముందు ఓకే అన్నా కూడా తర్వాత కేవలం కథ మాత్రమే ఇస్తా డైరెక్షన్ వేరే వాళ్లు చేస్తారని అన్నాడట.

స్క్రిప్ట్ కోసం 3, 4 నెలలు పనిచేసిన ప్రశాంత్ వర్మ సినిమా డైరెక్షన్ చేయడం కుదరదని చెప్పాడట. ప్రశాంత్ వర్మ నిర్ణయం వల్ల బాలకృష్ణ (Balakrishna) అప్సెట్ అయ్యాడట. హనుమాన్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి ఆయన డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ సినిమా ఉండాలని అనుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మ ఆ సినిమా మీద అంత ఆసక్తిగా లేరని తెలుస్తుంది.

అంతేకాదు ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో కోసం కూడా ప్రశాంత్ వర్మని అడిగితే బిజీ అని అన్నారట. అలా అవైడ్ చేయడం ఊహించని బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ మీద సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. సినిమా అనుకోక ముందే చెప్పేస్తే పర్లేదు కానీ ముహుర్తం టైం కు కుదరదు అంటే ఎవరికైనా కష్టమే.

మరి ప్రశాంత్ వర్మని ఒప్పించి మోక్షజ్ఞ (Mokshagna)తో సినిమా చేస్తారా లేదా వేరే డైరెక్టర్ తో ముందుకెళ్తార అన్నది చూడాలి. మరి వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉంది. నిజంగానే ప్రశాంత్ వర్మ అలా చేశాడా లేదా ఇవన్నీ రూమర్సేనా అన్నది త్వరలో తెలుస్తుంది.

Also Read : Allu Arjun : సుకుమార్ రెడ్డి.. సోషల్ మీడియాలో కొత్త చర్చ..!