Jai Hanuman: జై ‘హనుమాన్’ చిత్రంలో స్టార్ హీరో

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటోంది. చిన్న సినిమాగా రిలీజై అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది.

Jai Hanuman: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటోంది. చిన్న సినిమాగా రిలీజై అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. ఓవర్ సీస్ లో టాప్ 5 లో నిలిచింది ఈ సినిమాకు ఇంతటి రెస్పాన్స్ వస్తుందని హనుమాన్ మేకర్స్ సైతం ఊహించలేదు. అంతలా హనుమాన్ జనాలకు విపరీతంగా నచ్చేసింది.

హనుమాన్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సీక్వెల్ లో హనుమ పాత్ర హైలెట్ కానున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జై హనుమాన్ గురించి మాట్లాడుతూ..హనుమంతుడి పాత్రలో ప్రముఖ హీరో నటించే అవకాశం ఉందని అన్నాడు.  ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఆంజనేయస్వామి పాత్ర పోషించేది ఓ స్టార్ హీరో అని తెలుస్తుంది. శాండిల్ వుడ్ స్టార్ హనుమాన్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యశ్ అని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. హనుమాన్ కథను ముందుగా యశ్ కి చెప్పాడట. అయితే.. సీక్వెల్ చేయ్ అందులో నటిస్తానని మాట ఇచ్చాడట. అప్పటికి ప్రశాంత్ వర్మ దగ్గర హనుమాన్ సీక్వెల్ ఆలోచన లేదట. యశ్ చెప్పిన తర్వాతే సీక్వెల్ ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది. మరి.. హనుమాన్ తో సంచలనం సృష్టించినట్టే.. జై హనుమాన్ తో కూడా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.

Also Read: Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం