Site icon HashtagU Telugu

Waves OTT App : వచ్చేసింది ‘వేవ్స్’ ఓటీటీ.. నెలకు రూ.30తో సబ్‌స్క్రిప్షన్.. అద్భుత ఫీచర్స్

Waves Ott App Prasar Bharati Ott Free Ott

Waves OTT App : తొలిసారిగా భారత ప్రభుత్వం కూడా ఓటీటీ వినోద విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వానికి చెందిన ప్రసారభారతి సంస్థ ‘వేవ్స్‌’(Waves) పేరుతో ఓటీటీ యాప్‌‌ను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని మనం గూగుల్ ప్లే స్టోర్,  యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని భావిస్తే..  Waves.pb అనే అధికారిక వెబ్‌సైటుకు వెళ్లి నచ్చిన ప్లాన్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యాప్‌లో అంతర్గతంగా పేమెంట్స్ చేసే సౌకర్యం అందుబాటులో లేదు.

Also Read :Cyanide Killings : ‘సైనైడ్ సైకో’కు మరణశిక్ష.. అప్పులు ఇచ్చిన 14 మంది ఫ్రెండ్స్ మర్డర్

3 రకాల సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు ఇవీ..

మూడు రకాల సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను ‘వేవ్స్’ ఓటీటీ(Waves OTT App) అందిస్తోంది. అవి.. ప్లాటినం ప్లాన్, డైమండ్ ప్లాన్, గోల్డ్ ప్లాన్. ఒక్కో ప్లాన్ ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనాన్ని యూజర్లు పొందొచ్చు.

  • డైమండ్ ప్లాన్‌ను సబ్ స్క్రయిబ్ చేసుకునేందుకు సంవత్సరానికి రూ.350 చొప్పున చెల్లించాలి. లేదంటే రూ.85తో మూడు నెలల కోసం సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అది కూడా వీలు కాకుంటే రూ.30తో నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌ తీసుకుంటే 2 వేర్వేరు డివైజ్‌లలో వేవ్స్ యాప్‌ను చూడొచ్చు. హెచ్‌డీ క్వాలిటీ కంటెంట్ లభిస్తుంది. డౌన్ లోడ్స్ చేసుకోవచ్చు. లైవ్ టీవీ, రేడియో, మూవీస్ వంటి కంటెంట్ లభిస్తుంది.
  • గోల్డ్ ప్లాన్‌ను సబ్ స్క్రయిబ్ చేసుకునేందుకు సంవత్సరానికి రూ.350 చొప్పున చెల్లించాలి. అయితే ఈ ప్లాన్‌లో మనం ఒక డివైజ్ నుంచి వేవ్స్ యాప్‌ను చూడగలుగుతాం. సాధారణ క్వాలిటీ కలిగిన కంటెంట్‌ను చూడగలుగుతాం. రేడియో, లైవ్ టీవీ యాక్సెస్ లభిస్తాయి.

వేవ్స్‌లో ఇంకా ఏమున్నాయ్ ?

  • అన్ని కేటగిరీలకు చెందిన 65 లైవ్ టీవీ ఛానళ్లు లభిస్తాయి.
  • మూవీస్, వెబ్ సిరీస్‌లు చూడొచ్చు.
  • వీడియో ఆన్ డిమాండ్ సర్వీసు అందుబాటులో ఉంది.
  • గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.
  • ఓఎన్‌డీసీ భాగస్వామ్యంతో ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యం వేవ్స్ యాప్‌లో లభిస్తుంది.
  • ప్రముఖుల ఫొటో గ్యాలరీలు, ఈ-బుక్స్ లభిస్తాయి.

Also Read :Yasin Malik Case : ‘‘కసబ్‌‌ను న్యాయంగా విచారించాం.. యాసిన్‌‌‌‌ను అలా విచారించొద్దా ?’’.. ‘సుప్రీం’ ప్రశ్న