Prasar Bharati OTT : ప్రస్తుతం ఓటీటీ (ఓవర్ ది టాప్) రంగంలో ప్రైవేటు కంపెనీల హవా నడుస్తోంది. దేశంలో దాదాపు 78 ఓటీటీ సర్వీసులు ఉండగా.. వాటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు భారీగా ఉన్నాయి. ఇలాంటి టైంలో సామాన్యుల కోసం ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి నడుం బిగించింది. ఈనెల 20న ప్రసార భారతి ఓటీటీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో లైవ్ టీవీ ఛానళ్లతో పాటు వివిధ రకాల మీడియా మెటీరియల్స్ ప్రసారం అవుతాయి. గోవా వేదికగా ఈనెల 20న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ ఈవెంట్ జరగబోతోంది. ఆ కార్యక్రమంలోనే ప్రసార భారతి ఓటీటీ సేవలను లాంచ్ చేయనున్నారు. దూరదర్శన్ ఫ్రీ డిష్‌లో అందుబాటులో ఉన్న 60 టీవీ ఛానళ్లు.. ప్రసార భారతి ఓటీటీలో(Prasar Bharati OTT) సైతం ప్రసారం అవుతాయి. గతంలో ఖ్యాతి గడించిన సినిమాలు, ఆల్‌టైమ్ హిట్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఇందులో చూడొచ్చు.
Also Read :Brazil : బ్రెజిల్ సుప్రీంకోర్టుపై సూసైడ్ ఎటాక్.. భారీ పేలుళ్లు.. ఒకరు మృతి
ప్రసార భారతి ఓటీటీలో ఏమేం ఉంటాయి ?
- ప్రసార భారతి ఓటీటీ అనేది ‘ఫ్యామిలీ ఫ్రెండ్లీ’గా ఉంటుందని అంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి ప్రపంచ ప్రేక్షకుల వరకూ అందరికీ దీన్ని అందుబాటులో తెస్తామని కేంద్ర సర్కారు అంటోంది.
- భారత సంస్కృతి, సంప్రదాయాల్ని, జాతీయవాద విలువల్ని కాపాడే లక్ష్యంతో కంటెంట్ ఉంటుంది. అసభ్యకర, దూషణాత్మక భాషతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేయరు.
- ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌తో పాటు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాములు కూడా కవర్ చేస్తారు.
- 4కే రెజల్యూషన్‌లో వినియోగదారుల కోసం వీడియో-ఆన్-డిమాండ్ (వీఓడీ) మల్టీ స్క్రీన్ సౌకర్యాన్ని అందించడం ఈ ఓటీటీ లక్ష్యం.
- షోలు, క్రికెట్ టోర్నమెంట్‌లు సహా ఛానెల్‌లు, ప్యాకేజీలు, కంటెంట్‌ని కొనేలా కార్ట్ ఫీచర్‌ని కూడా పొందొచ్చు.
- ప్రసార భారతి ఓటీటీ ద్వారా ప్రారంభంలో కంటెంట్‌ని కొంతకాలం పాటు ఫ్రీగా అందించాలని భావిస్తున్నారు.
- కంటెంట్‌ను డెవలప్ చేయడానికి విపుల్ షా, కబీర్ బేడీ వంటి ప్రముఖ కంటెంట్ సృష్టికర్తలతో ప్రసార భారతి భాగస్వామ్యాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది.