Site icon HashtagU Telugu

Pranitha : తల్లైన ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న బాపు బొమ్మ

Pranithi

Pranithi

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలసి రావాలి. నటి ప్రణీత సుభాష్‌(Pranitha Subhash)కు మంచి నటనతో పాటు ఆకర్షణీయమైన అందం ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. 2010లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రణీత, తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ (Em Pillo Em Pillado) సినిమాతో తెరంగేట్రం చేసింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి టాప్ హీరోల చిత్రాల్లో నటించినప్పటికీ, ఎక్కువగా సెకండ్ హీరోయిన్‌గానే గుర్తింపు పొందింది. కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది.

Electricity sector : కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం: సీఎం చంద్రబాబు

దీంతో ప్రణీత 2021లో బిజినెస్‌మ్యాన్‌ నితిన్ రాజును వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత 2022లో పాపకు జన్మనిచ్చింది. తల్లైన తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ప్రణీత, పలు టెలివిజన్ షోలలో జడ్జిగా వ్యవహరించింది. ఇటీవల మరోసారి గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 2023లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ నటి, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన జీవితంలోని ప్రత్యేకమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ, తన గ్లామర్‌ను మెంటెయిన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Court : ‘కోర్ట్‌’ కు హిట్ టాక్..నానిని హత్తుకొని ఎమోషనల్ కు గురైన ప్రియ‌ద‌ర్శి

తాజాగా ప్రణీత తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. గ్రే కలర్ ప్యాంట్, షూట్ ధరించి, లోపల బ్రా కనిపించేలా ఇచ్చిన హొయలు నెటిజన్లలలో వేడి పుట్టిస్తున్నాయి. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇంతగ్లామర్‌ను ఎలా మెయింటైన్ చేస్తుందో? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమె గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రణీత షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వార్తల్లో నిలిచేలా చేసాయి.