Site icon HashtagU Telugu

Prakash Raj : కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెప్పిన ప్రకాశ్‌రాజ్

Prakashraj Sorry

Prakashraj Sorry

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj apologises)..హీరో సిద్దార్థ్ (Siddharth) కు క్షమాపణలు తెలిపారు. తాజాగా సిద్దార్థ్ కు కావేరి జల సెగ తగిలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక – తమిళనాడు మధ్య కావేరి జలవివాదం ఉద్రిత్తకు దారితీస్తుంది. ఇరు ప్రజలు వరుస నిరసనలు , ధర్నాలతో ఊగిపోతున్నారు. ఈ తరుణంలో హీరో సిద్దార్థ్..నటించిన ‘చిత్త’ (Chithha) కన్నడ వెర్షన్ ‘చిక్కు’ అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న బెంగళూరు వచ్చాడు. మల్లేశ్వరంలోని ఓ థియేటర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. ఈ ప్రెస్ మీట్‌ ను కరవే స్వాభిమాని సేన కార్యకర్తలు (Sahrudaya Kannadigas) అడ్డుకున్నారు. ‘తమిళనాడుకు మా నీళ్లు పోతున్నాయి. ఇక్కడ తమిళ సినిమా గురించి ప్రెస్ మీట్ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఇవన్నీ అవసరమా?’ అని నటుడు సిద్ధార్థ్‌ను నిరసనకారులు ప్రశ్నించారు. అంతేకాకుండా, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీంతో సిద్ధార్థ్ మీడియా సమావేశం నిర్వహించకుండానే బయటకు వెళ్లిపోయారు.

ఈ ఘటన ఫై ప్రకాష్ రాజ్ (Prakash Raj) స్పందించారు. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య (Cauvery Water Dispute) దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు అంటూ ప్రకాశ్‌రాజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read Also : AP : చంద్రబాబు అరెస్ట్ ను క్యాష్ చేసుకోవాలని జగన్ ముందస్తుకు వెళ్తున్నాడా..?

ఇక ప్రకాష్ రాజ్ – సిద్దార్థ్ కలయికలో చాల సినిమాలే వచ్చాయి. తెలుగు లో బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల్లో వీరిద్దరూ తండ్రికొడుకుల్లా నటించి మెప్పించారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతుంది. చాలాసంధర్భాలలో వీరు కలుసుకోవడం..మాట్లాడుకోవడం చేస్తూ వచ్చారు. తరుచు కూడా ఫోన్లలో టచ్ లోనే ఉంటారు.