Pradeep Machiraju: ప్ర‌దీప్ మాచిరాజు సినిమా ఎలా ఉంది? మ‌రో హిట్ అందుకున్నాడా?

సినిమా గురించి ప్రాథమిక సమీక్షలు, సోషల్ మీడియా స్పందనల ఆధారంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Pradeep Machiraju

Pradeep Machiraju

Pradeep Machiraju: ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) నటించిన తాజా సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా ఏప్రిల్ 11, 2025న విడుదలైంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ మూవీని నితిన్ భరత్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో దీపికా పిళ్లై హీరోయిన్‌గా నటించింది.

సినిమా గురించి ప్రాథమిక సమీక్షలు, సోషల్ మీడియా స్పందనల ఆధారంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని తెలుస్తోంది. ప్రదీప్‌ యాంకర్‌గా తన ఎనర్జీ, న‌ట‌న‌ను తెరపైనా చూపించాడని, కామెడీ టైమింగ్ బాగుందని కొందరు అభిప్రాయపడ్డారు. వెన్నెల కిషోర్, సత్య వంటి నటులు సినిమాకు అదనపు హైలైట్‌గా నిలిచారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, లైట్‌హార్టెడ్ ఫీల్‌తో ఒకసారి చూడదగిన చిత్రంగా ఉందని సమీక్షలు సూచిస్తున్నాయి. అయితే విమర్శకుల నుండి వచ్చే సమీక్షలు, బాక్సాఫీస్ పనితీరు ఆధారంగా మరింత స్పష్టత వస్తుంది.

Also Read: Banana: అరటిపండును పరగడుపున తింటే ప్రమాదమా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో ప్ర‌దీప్‌ బాగా కనిపించాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వంటి నటులు సినిమాకు మరింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను యాడ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కథలో పెద్దగా కొత్తదనం లేద‌ని కొంద‌రి వాద‌న‌. కానీ హాస్యం, రొమాన్స్‌తో కలిసి కుటుంబ ప్రేక్షకులను ఆక‌ట్టుకోవ‌చ్చు ఈ సినిమా.

కథ గురించి చెప్పాలంటే.. ఒక సివిల్ ఇంజనీర్ (ప్రదీప్) గ్రామంలోకి పని నిమిత్తం వస్తాడు. అక్కడి అమ్మాయి (దీపికా)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది సినిమా ఆధారం. రధన్ సంగీతం, గ్రామీణ నేపథ్యం సినిమాకు అదనపు ఆకర్షణ. అయితే కొంతమంది సినిమా రొటీన్ కథనంతో సాగుతుందని, ఊహించిన మలుపులు ఉన్నాయని అన్నారు. మ‌రీ ఈ సినిమా హిట్లో.. ఫ‌ట్టో తెలియాలంటే ఈరోజు ఆగాల్సిందే.

  Last Updated: 18 Apr 2025, 02:11 PM IST