PrabhasXHombale3movies రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. త్వరలోనే స్పిరిట్ సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ నుంచి స్పిరిట్ సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే స్పిరిట్ తో పాటు త్వరలోనే కల్కి 2 కూడా మొదలు కాబోతుందని తెలుస్తుంది.
ఐతే ప్రభాస్ (Prabhas) తో హోంబలె ప్రొడక్షన్స్ 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకుంది. సలార్ 1 తో వారి కలయిక జరిగింది. ఇక సలార్ 2 తో పాటు మరో 2 సినిమాలు అంటే ముచ్చటగా 3 సినిమాలు ప్రభాస్ తో హోంబలె ప్రొడక్షన్స్ సినిమాలు చేస్తుంది. అది కూడా 2026, 2027, 2028 మూడేళ్లలో 3 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మరో ఇద్దరు దర్శకులు..
సలార్ 2 ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడు. మరో ఇద్దరు దర్శకులు ఎవరన్నది చూడాలి. ఐతే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఒక అద్భుతమైన కథతో హోంబలె ప్రొడక్షన్ ని కలవగా ప్రభాస్ తో ఆ సినిమా లాక్ చేశారని తెలుస్తుంది. ప్రభాస్ తో హోంబలె (Hombal)e ప్రొడక్షన్స్ చేస్తున్న ఈ 3 సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ప్రభాస్ సలార్ 1 సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సలార్ 2 (Salaar 2) శౌర్యాంగ పర్వం తో సర్ ప్రైజ్ చేయనున్న ప్రభాస్ మరో రెండు సినిమాలతో హోంబలె ప్రొడక్షన్స్ తో కలిసి పనిచేయనున్నాడు. ప్రభాస్ సినిమాల వేగాన్ని చూస్తుంటే మిగతా స్టార్స్ అంతా కూడా ముక్కున వేలేసుకునేలా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రభాస్ నుంచి ఏడాదికి రెండు సినిమాల రిలీజ్ ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Also Read : Pushpa 2 Item Song Leak : పుష్ప 2 ఐటెం సాంగ్ లీక్..శ్రీలీల మాములుగా లేదుగా..!!