Prabhas : ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాక వరుస ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉండగా నిన్న హోంబలె మరో రెండు సినిమాలను ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవ పూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ సినిమాల షూటింగ్స్ జరుగుతాగున్నాయి.
అయితే వీటికి తోడు సలార్ 2 కూడా మొదలవుతుందని హోంబలె సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే 2026 లోనే సలార్ 2 సినిమా రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించారు. దీంతో ప్రభాస్ రాజాసాబ్ షూట్ అవ్వగానే హను రాఘవపూడి సినిమా, సలార్ 2 సినిమా ఒకేసారి షూట్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సలార్ 2 స్క్రిప్ట్ పూర్తిచేశారు. కొంత షూట్ కూడా చేసారు.
హోంబలె ప్రకటనతో 2025లో సలార్ 2 షూటింగ్ చేసి 2026లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఇటీవలే ఎన్టీఆర్ – నీల్ సినిమా పూజా కార్యక్రమం కూడా చేసారు. ఈ సినిమా కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే షూట్ మొదలవుతుంది అనుకునేలోపు సలార్ 2 మొదలుపెడుతున్నామని ప్రకటన వచ్చింది. దీంతో సలార్ 2 అయ్యాకే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ లోపు ఎన్టీఆర్ వార్ 2 షూట్ పూర్తి చేసుకొని రావొచ్చు.
The journey is going to be epic…💥#Salaar2 begins!#PrabhasXHombal3Films #Prabhas #PrashanthNeel @PrithviOfficial @Vkiragandur @hombalefilms pic.twitter.com/1bqHuZvD1E
— Salaar (@SalaarTheSaga) November 8, 2024
మొత్తానికి ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తున్నాడు. ప్రభాస్ సలార్ 1 పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ సలార్ 2 – శౌర్యంగా పర్వం గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read : KL Rahul : తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. ప్రగ్నెంట్ అయిన హీరోయిన్..