Site icon HashtagU Telugu

Prabhas : సినిమాలకు ప్రభాస్ బ్రేక్..ఎందుకంటే..!!

Prabhas Break To Movies

Prabhas Break To Movies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..కొద్దీ రోజుల పాటు సినిమా షూటింగ్ లకు బ్రేక్ (Break) ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. బాహుబలి తర్వాత వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న..డార్లింగ్..రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మళ్లీ సక్సెస్ బాటలోకి వెళ్లిపోయారు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22 న పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం తో ప్రభాస్ నుండి వరుస సినిమాలు వస్తాయని అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం కాస్త బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ (Health Concerns) కూడా జరిగింది. దీంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకొని తన ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి , రాజా సాబ్ మూవీస్ ఉన్నాయి. వీటిలో కల్కి మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. డబ్బింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇక మారుతీ డైరెక్షన్లో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సగం వరకు అయ్యింది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ లకు బ్రేక్ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కానుంది.

Read Also : Rambabu vs Jagan : జగన్ యాత్రకు దీటుగా రాంబాబు వస్తున్నాడు..ఏమన్నా సిద్ధమా..!!