రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. సలార్ 1, కల్కి సినిమాల హిట్ తో ప్రభాస్ సినిమా అంటే చాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా కూడా పిచ్చెక్కిపోతున్నారు. అలాంటిది యానిమల్ లాంటి సెన్సేషనల్ సినిమా తీసిన డైరెక్టర్ సందీప్ తో సినిమా అంటే వేరే లెవెల్ లో అంచనాలు ఉంటాయి. ప్రభాస్ స్పిరిట్ సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిషని హీరోయిన్ గా లాక్ చేసినట్టు తెలుస్తుంది.
ఐతే సినిమాలో త్రిష నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తుందని టాక్. అంతేకాదు ప్రభాస్ (Prabhas ) కూడా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. హీరో, విలన్ ఇద్దరు ప్రభాస్ కనిపిస్తాడట. సందీప్ వంగ స్పిరిట్ ని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్పిరిట్ సినిమాతో త్రిష మరోసారి సర్ ప్రైజ్ చేయనుందని తెలుస్తుంది.
ప్రభాస్ తో కలిసి త్రిష (Trisha) ఇప్పటికే 3 సినిమాల్లో నటించింది. వర్షం (Varsham) తో ఈ జంట సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పౌర్ణమి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. థర్డ్ మూవీ బుజ్జిగాడు పర్వాలేదు అనిపించింది. ప్రభాస్, త్రిష జోడీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే త్రిష ఈమధ్య తెలుగు సినిమాలు వదిలి తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. అందుకే అమ్మడు ఇక్కడ సినిమాలకు గ్యాప్ వచ్చింది.
ప్రభాస్ స్పిరిట్ లో త్రిష నటించడం కన్ ఫర్మ్ అయితే దాదాపు 15, 16 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తారని చెప్పొచ్చు. త్రిష ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.
Also Read : Samantha : సమంత మెరుపులు చూశారా..?