Prabhas: సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్.. బాలయ్య, గోపీచంద్ తో అన్‌స్టాపబుల్ టాక్!!

నందమూరి బాలకృష్ణ (Balkrishna) టాక్ షో అన్‌స్టాపబుల్ 2 కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలో వచ్చే ఎపిసోడ్ లో తెలుగు స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు.

  • Written By:
  • Updated On - December 19, 2022 / 12:52 PM IST

నందమూరి బాలకృష్ణ (Balkrishna) టాక్ షో అన్‌స్టాపబుల్ 2 కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలో వచ్చే ఎపిసోడ్ లో తెలుగు స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు. ఆ ఎపిసోడ్ ప్రోమోను ఓటీటీ ప్లాట్ ఫామ్ AHA ఇటీవల తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో విడుదల చేసింది.ఇప్పుడిది వైరల్ అవుతోంది. దీనిలో ప్రభాస్ తన హోస్ట్‌ బాలయ్యతో సరదాగా సమయాన్ని గడిపారు. చిరునవ్వుతో వేదికపైకి వచ్చిన బాహుబలి స్టార్‌ని ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతం పలకడంతో ప్రోమో ప్రారంభమైంది.  బాలయ్య.. ప్రభాస్ ప్రేమ జీవితం గురించి అడుగుతారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నిస్తారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. “సల్మాన్ ఖాన్ తర్వాత” అని బదులిచ్చి బిగ్గరగా నవ్వాడు.

ప్రభాస్ స్త్రీలను ఆకట్టుకుంటాడా లేదా వారు అతని వ్యక్తిత్వంతో ప్రేమలో పడతారా అనే దానిపై బాలయ్య మరింత ప్రశ్నించారు.
స్టార్ హీరో ప్రభాస్ స్నేహితుడు అయిన నటుడు గోపీచంద్ కూడా వేదికపై అతనితో కలిసి నందమూరి బాలకృష్ణతో ముచ్చట్లు పెట్టారు. ఈసందర్భంగా ప్రభాస్ దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని శివ రామ కృష్ణ పట్ల తనకున్న ప్రేమ మరియు గౌరవం గురించి కూడా మాట్లాడాడు.

30వ తేదీన కార్యక్రమం ప్రసారం

ఈ టాక్ షో మధ్యలో ప్రభాస్.. రామ్ చరణ్ కు కాల్ చేయడం అందరినీ ఎగ్జైట్ చేసింది. ఈనెల 30వ తేదీన ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. 30వ తేదీన కార్యక్రమం ప్రసారం కానుండటంతో 29వ తేదీ వరకు ఈ ప్రోమోకు ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ఆహా అంచనా వేస్తోంది.