Prabhas Movie : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించాలి అనుకుంటున్నారా? ఈ ఛాన్స్ మీకోసమే..

తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించడానికి కొత్తవాళ్లను, కాస్త అనుభవం ఉన్నవాళ్లను తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Prabhas Sandeep Reddy Vanga Spirit Movie Casting Call Announced

Prabhas Spirit

Prabhas Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపు హను రాఘవపూడి సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయనున్నాడు.

రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలు ఈ సంవత్సరం చివరికి అయిపోతాయి. డిసెంబర్ నుంచి లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో స్పిరిట్ సినిమా మొదలు కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే తన కల్ట్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనగానే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు అని, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సందీప్ రెడ్డి తెలిపాడు.

తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించడానికి కొత్తవాళ్లను, కాస్త అనుభవం ఉన్నవాళ్లను తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనలో.. స్పిరిట్ సినిమాలో నటించడానికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు సినిమా, థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు కావాలి. మీరు ఎలా ఉంటారు అని రెండు ఫోటోలు, అలాగే మీరు ఎవరు, ఏం చేస్తున్నారు, మీ అనుభవం ఏంటి అని ఓ రెండు నిమిషాల వీడియో చేసి ఆ ఫోటోలు, వీడియోలు spirit.bhadrakalipictures@gmail.com కి పంపించండి అని ప్రకటించారు. దీంతో సినీ పరిశ్రమలో ఉండే చిన్న చిన్న ఆర్టిస్టులతో పాటు కొత్త వాళ్ళు కూడా స్పిరిట్ సినిమాలో ఛాన్స్ కోసం అప్లై చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి అన్ని కుదిరితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం రావొచ్చు.

Spirit Casting Call

 

Also Read : Pawan Kalyan: తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్

  Last Updated: 13 Feb 2025, 09:30 AM IST