Site icon HashtagU Telugu

Salaar Postponed: డిసెంబర్ లో సలార్.. జవాన్ అడ్వాన్స్ బుకింగ్ చూసి సలార్ మేకర్స్ షాక్!

Salaar Postponed

New Web Story Copy 2023 09 02t133846.145

Salaar Postponed: 2023 సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ప్రభాస్ నటించిన సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటే ఏ రేంజ్ లో ఎక్సపెక్ట్షన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీల్ టేకింగ్ కి ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్లో ప్రభాస్ గురించి చెప్పే ఎలివేషన్ డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాని సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేశారు.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ని కట్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీపికతో పోరాటం, నయనతారతో రొమాన్స్ సీన్స్ సినిమాకి హైలెట్ కానున్నాయి. ఇక అట్లీ స్క్రీన్ ప్లే గురించి తెలిసిందే. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లగలడు.

అయితే తాజాగా సమాచారం మేరకు సలార్ సినిమా విడుదల తేదీని మార్చబోతున్నారట. ఈ సినిమా విడుదల తేదీని సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పొడిగించారు. దీనికి షారుక్ ఖాన్ ‘జవాన్’ కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. జవాన్ అడ్వాన్స్ బుకింగ్ చూసిన సలార్ మేకర్స్ రిలీజ్ డేట్ పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రభాస్ సలార్ రిలీజ్ చేస్తే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ వసూళ్లపై ఆ ప్రభావం ఉండబోతున్నట్టు మేకర్స్ భావిస్తున్నారు. అందుకే మేకర్స్ రెండు సినిమాలకు నష్టం జరగకుండా ఉండేందుకు సలార్ ని కాస్త ముందుకు జరిపినట్టు తెలుస్తుంది. రిపోర్ట్ ప్రకారం సాలార్ సినిమా డిసెంబర్ లో విడుదల అవ్వనుంది.

Read Also: Countries Race To Moon : సూర్యుడిపై రీసెర్చ్ రేసులో ఉన్న దేశాలివీ..