Site icon HashtagU Telugu

Salaar : జపాన్‌లో కూడా సలార్ గ్రాండ్ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

Prabhas Salaar Part 1 Cease Fire ready To Release in Japan Full Details Here

Prabhas Salaar Part 1 Cease Fire ready To Release in Japan Full Details Here

ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్(Salaar) సినిమా ఇటీవల డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి భారీ విజయం సాధించింది. సలార్ ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తుంది. సలార్ సినిమా ఇప్పటికే 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది.

ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సలార్ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజయింది. ఇప్పుడు జపనీస్ భాషలో కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది.

జపాన్(Japan) లో మన ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ ఉంది. ఇటీవల RRR సినిమా అయితే జపాన్ రిలీజ్ కి ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అక్కడికి వెళ్లి మరీ ప్రచారం చేశారు. అక్కడ కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో జపాన్ లో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అక్కడ కూడా ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజుని కూడా అక్కడ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.

ప్రస్తుతం జపాన్ లో తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్, మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ప్రభాస్ సలార్ ని కూడా అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. సలార్ సినిమాని జపాన్ లో ఈ సమ్మర్ కి రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటు జపనీస్ భాషలో సలార్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక సలార్ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియ రెడ్డి, శృతిహాసన్, ఈశ్వరిరావు, బాబీ సింహ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. 2025 లో పార్ట్ 2 వస్తుందని అంచనా.

Also Read : Peter Hein : హీరోగా స్టార్ ఫైట్ మాస్టర్.. పాన్ ఇండియా సినిమాతో..