Prabhas కె.జి.ఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేశాడు. సలార్ 1 సీజ్ ఫైర్ అంటూ రెబల్ ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. కొన్నాళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్న ఊర మాస్ ట్రీట్ ని అందించాడు ప్రసాంత్ నీల్. ఐతే ప్రభాస్ కల్కి రిలీజ్ తర్వాత సలార్ 2 చేస్తాడని అనుకున్నారు. కానీ ఆగష్టు నుంచి ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ సినిమాకు షెడ్యూల్ కన్ ఫర్మ్ చేశాడు. తారక్ సినిమా మొదలైతే ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది మరి సలార్ 2 పరిస్థితి ఏంటి అంటే.. సలార్ 2 దాదాపు క్యాన్సిల్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.
సలార్ 1 షూట్ టైం లో ప్రశాంత్ నీల్ తో డార్లింగ్ ప్రభాస్ కు అభిప్రాయ బేధాలు వచ్చాయని.. సలార్ 1 రిలీజ్ తర్వాత అది మరింత పెరిగిందని. అందుకే సలార్ 2 ను పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమాకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. మరోపక్క సలార్ 2తో ఎన్.టి.ఆర్ సినిమాను లింక్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ ని రెడీ చేస్తున్నాడని అంటున్నారు.
సలార్ 2 కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్ 2 శౌర్యాంగ పర్వం వస్తే మాత్రం మరోసారి ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి పూర్తి చేశాడు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ కూడా సెట్స్ మీద ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటికి పూర్తి చేస్తారన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Bahubali Star for Mahesh Babu : మహేష్ సినిమా కోసం మరోసారి బాహుబలి స్టార్.. రాజమౌళి సూపర్ ప్లాన్..!