Prabhas : ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ భారీగానే ఉంది. రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, కల్కి 2, సలార్ 2.. ఇలా వరుస పెట్టి భారీ సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ మరో ఇద్దరు యువ డైరెక్టర్స్ కి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం.
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(Prasanth Varma Cinematic Universe) ప్రకటించి తన సినిమాలపై భారీ అంచనాలు నెలకొనేలా చేసారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఆరు సినిమాలు అనౌన్స్ చేసారు. ఇప్పుడు ఈ యూనివర్స్ లోకి ప్రభాస్ ని తీసుకొస్తున్నాడట. గతంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కు బ్రహ్మరాక్షస అనే ఓ కథని చెప్పగా మొదట ఓకే అనుకున్నా ఆ తర్వాత పలు కారణాలతో రణవీర్ సింగ్ నో చెప్పాడు. దీంతో ఆ కథను ప్రభాస్ కు చెప్పగా ప్రభాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరో నెగిటివ్ షేడ్స్ లో ఉంటాడట.
అలాగే తమిళ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(Lokesh Cinematic Universe) తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఒకదానికి ఒకటి లింక్ పెట్టి సరికొత్తగా సినిమాటిక్ యూనివర్స్ చూపిస్తున్నాడు. ఇతని దర్శకత్వంలో రాబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే లోకేష్ కూడా ప్రభాస్ కి కథ చెప్పినట్టు, ప్రభాస్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతాడని టాక్ వినిపిస్తుంది.
ఈ రెండు వార్తలు నిజమయితే కనక ప్రభాస్ ని సరికొత్తగా చూడొచ్చు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ ని నెగిటివ్ షేడ్స్ లో, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో యాక్షన్ హీరోగా చూడొచ్చు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తుంది.
Also Read : Gangavva : ఆరోగ్య సమస్యలతో గంగవ్వ కూడా బిగ్ బాస్ నుంచి బయటకు.. నేనే వెళ్ళిపోతాను అంటూ కామెంట్స్..