Site icon HashtagU Telugu

Prabhas Rebal Star Fans : ప్రభాస్ సరసన శ్రీలీల.. ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ..!

Prabhas Kannappa doing without Remuneration

Prabhas Kannappa doing without Remuneration

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సమ్మర్ కి కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. సినిమా రిలీజ్ పై డౌట్స్ ఉన్నా ఫ్యాన్స్ మాత్రం సినిమాపై సూపర్ బజ్ తో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే ప్రభాస్ సినిమాల లైనప్ లో హను రాఘవపుడి కూడా ఉన్నాడు. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేస్తున్నాడు.

ఈ సినిమా వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీగా చేస్తున్నాడట. ఈ సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. పెళ్లిసందడి, ధమాకాతో మొదలు పెట్టి వరుస సినిమాలతో తన హవా కొనసాగుతుంది శ్రీ లీల. అయితే సినిమాలతో పాటు శ్రీ లీల ఫ్లాపులు కూడా పడ్డాయి.

ఆ ఫ్లాపులే ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నాయి. ప్రభాస్ సినిమాలో శ్రీ లీల అని తెలియగానే ఫ్యాన్స్ అంతా కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవద్దని ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read : Sundeep Kishan Ooruperu BhairavakOna : భైరవ కోన టీం తో బుజ్జగింపులు.. సోలో డేట్ ఇచ్చేలా..!

ఇదే సీన్ పూజా హెగ్దే విషయంలో రిపీట్ అయ్యింది. వరుస ఫ్లాపులు ఉన్నా ప్రభాస్ రాధే శ్యాం లో ఆమెను తీసుకున్నారు. అనుకున్నట్టుగానే సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్ శ్రీ లీల కాంబినేషన్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ సినిమాలో శ్రీ లీలని కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి. ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అయ్యాక కానీ హను మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాతో పాటుగా సందీప్ వంగ డైరెక్షన్ లో సినిమా స్పిరిట్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.