Prabhas Exclusive: బాలయ్య తో దబిడిదిబిడే.. అనుశ్క, కృతి సనన్‌ లతో డేటింగ్ పై ప్రభాస్ రియాక్షన్!

ప్రభాస్ (Prabhas) బాలయ్య టాక్ షో ఓ రేంజ్ లో ఉండబోతోంది. డేటింగ్, మ్యారేజ్ వార్తలపై ఓపెన్ అయ్యాడు ప్రభాస్

  • Written By:
  • Updated On - December 14, 2022 / 05:35 PM IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri balakrishna) హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK 2’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నవిషయం తెలిసిందే. ఒక్కో షోకు ఒక్కో గెస్టును ఇన్వైట్ చేస్తూ, ఆసక్తికర విషయాలను రివీల్ చేస్తూ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాబోతున్న వార్త తెలిసిందే. ఈ వార అటు బాలయ్య, ఇటు ప్రభాస్ ఫాన్స్ లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన గింప్ల్స్, లుక్స్ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నట్టుగానే ఈ షో చాలా రసవత్తరంగా ఉండబోతోంది. గోపీచంద్ ప్రభాస్ కు మంచి స్నేహితుడు. వీళ్లిదరి ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షో లో మరోసారి వీరి ఫ్రెండ్ షిప్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రభాస్ నిజ జీవితంలో చాలా ప్రైవేట్ వ్యక్తి. అయితే తొలిసారిగా బాహుబలి స్టార్‌ ను ఎప్పుడూ చూడని కోణంలో చూడబోతున్నారు. అనుష్క శెట్టి, కృతి సనన్‌లతో డేటింగ్ పుకార్లపై బాలయ్య ప్రభాస్ (Prabhas) అడిగాడట.

ఒకవైపు డేటింగ్, మరోవైపు పెళ్లి రూమర్స్ పై లాంటి వార్తలపై ప్రభాస్ ను బాలయ్య అడిగినట్టు తెలుస్తోంది. ప్రభాస్ మొదటిసారి తన మ్యారేజ్ గురించి కూడా ఈ షో లో ఓపెన్ కాబోతున్నాడు. గతంలో అనుష్క ను పెళ్లి చేసుకోబోతున్నాడని మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్ పై నిజజీవితంలో సైలంట్ ఉన్నా.. బాలయ్య షో లో మాత్రం ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. టాలీవుడ్ (Tollywood)లో చాలామంది పెళ్లి చేసుకున్నా తాను మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ ఆఫ్ టాలీవుడ్ బ్యాచిలర్ ఎందుకు మిగిలిపోయానో లాంటి ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారట

ఇక కృతి సనన్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్ కృతి తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ మాత్రం తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చినా ప్రభాస్ మాత్రం ఇవ్వలేదు. ఇవన్నీ ఈ షో లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి బాలయ్య (Balakrishna), ప్రభాస్ షో మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని అని తెలుస్తోంది.

Also Read: 12 Crore Car: రిచ్ కా బాప్.. నసీర్ కారు, చాలా రిచ్ గురూ!