రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా థమన్ ఈ సినిమా గురించి చెబుతూ మంచి కమర్షియల్ సినిమా అవుతుందని అన్నారు.
అంతేకాదు రాజా సాబ్ లో ఆరు పాటలు ఉంటాయని ఒక సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ కూడా ఉంటుందని అన్నాడు. ఐతే ప్రభాస్ (Prabhas,) సినిమా అంటే కృష్ణం రాజు పాటని రీమిక్స్ చేస్తారని అందరు అనుకుంటారు. కానీ మారుతి ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి బాలీవుడ్ సాంగ్ రీమిక్స్ చేయాలని చూస్తున్నారట.
ఇన్సాఫ్ అప్నే లాహూ సే సినిమాలో హవా హవా సాంగ్..
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇన్సాఫ్ అప్నే లాహూ సే సినిమాలో హవా హవా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారని టాక్. ఆల్రెడీ ఈ సాంగ్ కి సంబందించిన రైట్స్ తీసుకున్నారట. ఇన్సాఫ్ అప్నే లాహూ సే లో సంజయ్ దత్ (Sanjay Datt) నటించాడు. రాజా సాబ్ సినిమాలో కూడా సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడు. సో అందుకే ఈ సాంగ్ ని రీమిక్స్ చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా ఈమధ్య రీమిక్స్ సాంగ్ ల హవా కాస్త తగ్గగా మళ్లీ ప్రభాస్ రాజా సాబ్ (Rajasaab) తో సినిమా ఆ ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఉంటుని. ఈ సినిమాతో పాటుగా హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజి, సందీప్ వంగతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
Also Read : Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్ లో బోజ్ పురి స్టార్ డాన్స్..!