Prabhas Raja Saab Teaser రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన గ్లింప్స్ అలరించింది. ఇక ఇప్పుడు దసరాకి మరో కొత్త టీజర్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా రాజా సాబ్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుని. రాజా సాబ్ సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ కథాంశంతో వస్తుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ పరంగా కూడా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక దసరా (Dasara)కి రాజా సాబ్ టీజర్ (Raja Saab Teaser) వస్తుందని తెలియగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.
కల్కి తర్వాత ప్రభాస్..
కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా రాజా సాబ్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో అలరిస్తారని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ సత్తా ఏంటో చాటుతున్న ఈ టైం లో రాజా సాబ్ తో కూడా మరోసారి తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు.
ప్రభాస్ రాజా సాబ్ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా టీజర్ దసరాకి వస్తే సినిమా సందడి అప్పటి నుంచే షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు రెబల్ ఫ్యాన్స్.
Also Read : Samantha : అలియా భట్ కోసం సమంత..?