పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే (Prabhas Birthday) సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘రాజాసాబ్’ (Raaja Saab) నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. అందులో చెక్స్ షర్టులో ప్రభాస్ చాల స్టైలిష్ గా కనిపించారు. అయితే, ఇదే షర్టును ‘విశ్వం’ (Viswam) సినిమాలో గోపీచంద్ (Gopichand) వేసుకున్నారని..అదే షర్ట్ ను ప్రభాస్ రాజా సాబ్ లో వేసుకున్నాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా రెండు సినిమాల ప్రొడ్యూసర్ ‘బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కావడం తో ఇలా అక్కడివి..ఇక్కడ..ఇక్కడివి అక్కడ వాడుకున్నారని ..బడ్జెట్ తగ్గించేందుకు ఇలా చేసారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సదరు నిర్మాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రావడమే కాదు, వాటితో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని ఏలుతున్నారు. ప్రభాస్ లైనప్ తరువాత రాబోయే సినిమాలు రాజాసాబ్, కల్కి 2, సలార్ 2, ఫౌజీ. వీటిలో రాజాసాబ్ సినిమా.. ప్రస్తుతం ఉన్న ప్రభాస్ ఇమేజ్ కి పూర్తి భిన్నమైనది అనే చెప్పాలి. మాస్ అండ్ ఫ్యూచరిస్టిక్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. రాజాసాబ్ తో హారర్ బ్యాక్ డ్రాప్ ని టచ్ చేస్తున్నారు.
ఈ సినిమాని మారుతీ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడి నుంచి ‘ప్రేమ కథా చిత్రం’ అనే హారర్ కామెడీ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో మళ్ళీ ఆ సక్సెస్ ఫార్ములానే ఉపయోగిస్తూ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ కామెడీని మళ్ళీ ఆడియన్స్ కి రుచి చూపించబోతున్నట్లు దర్శకుడు చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా పతాకం పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఈ నిర్మాత నిర్మించిన పలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి నష్టాలను మిగిలిచాయి. ఇక ఆ నష్టాలు అన్నిటిని పూడ్చుకోవడం కోసం నిర్మాత.. ప్రభాస్ సినిమా పైనే అసలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభాస్ మార్కెట్ కి ప్లాప్ సినిమా కూడా 500 కోట్ల సులువుగా దాటేస్తుంది. దీంతో రాజాసాబ్ టాక్ ఎలా ఉన్నా.. 500 కోట్లు పక్కా అనే ధీమాలో నిర్మాత ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also : Pothole Free Roads : ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు