Site icon HashtagU Telugu

Prabhas Raja Saab : రాజా సాబ్ సెకండ్ హాఫ్.. రెబల్ ఫ్యాన్స్ కి రచ్చ రంబోలానే..!

Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. కామెడీ లో మంచి పట్టు ఉన్న మారుతి ఈ సినిమాను పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా సెకండ్ హాఫ్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. సినిమాలో సెకండ్ హాఫ్ ట్విస్ట్ అదిరిపోతుందట. అంతేకాదు ఒక పక్క కామెడీతో ఎంటర్టైన్ చేస్తూనే సినిమాలో ఎవరు ఊహించని అంశాలతో అదరగొట్టేస్తాడట మారుతి. సినిమాలో ప్రభాస్ లుక్, స్టైల్ అంతా కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేయగా సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్ రివీల్ అవుతూ ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని అంటున్నారు. మారుతి ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా ప్రమోషన్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రభాస్ రాజా సాబ్ పాన్ ఇండియా లెవెల్ లో 2025 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాడు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 బిగ్ అప్డేట్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ సీట్లు చిరిగిపోవాల్సిందేనా..!