Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు

PrabhasXHombale3movies Prabhas Hombale 3 Movies Agreement

PrabhasXHombale3movies Prabhas Hombale 3 Movies Agreement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరో అరుదైన రికార్డు సాధించారు. తాజాగా ఎక్స్ (Twitter) ఇండియా తాజా జాబితాలో ప్రభాస్ చోటు దక్కించుకున్నాడు. హ్యాష్‌ట్యాగ్‌లలో ప్రభాస్ ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్ లో ఉన్న ఏకైక సినీ నటుడిగా ప్రభాస్ ఉండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈశ్వర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్..ఆ తర్వాత ఛత్రపతి , డార్లింగ్ , మిర్చి సినిమాలతో క్లాస్ & మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొని టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఇక బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా అభిమానులయ్యారు. ఈ మూవీ తర్వాత సాహో , ఆదిపురుష్ , సలార్ తో పాన్ ఇండియా గా అలరిస్తున్నాడు.

ఇదిలా ఉంటె జనవరి 1, 2023 నుంచి జనవరి 1, 2024 మధ్య కాలంలో… ఏడాది పాటు మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్ టాగ్స్‌ను ఎక్స్ (ట్విట్టర్) విడుదల చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే… టాప్ 10 లిస్టులో ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచారు. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ 7వ స్థానంలో ఉంది. ఆయన రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా 9వ స్థానంలో ఉంది. ప్రభాస్ స్టార్ డమ్ (Prabhas Stardom)కు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ న్యూస్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్.. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ సినిమా ‘కల్కి 2989 ఏడీ’ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అలాగే మారుతీ డైరెక్షన్లో హారర్ ఎంటర్‌టైనర్ ‘రాజా సాబ్’ లో నటిస్తున్నాడు.

Read Also : Nabha Natesh : నభా నటేష్ పాన్ ఇండియా ఛాన్స్.. నిఖిల్ భారీ సినిమాలో అలాంటి పాత్రలో..!