Prabhas: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేకంగా ఎప్పట్నుంచో ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే ఈ డ్రగ్స్ నిర్మూలన సాధ్యపడటంలేదు. నిత్యం ఎక్కడో ఒక్కచోట డ్రగ్స్ సరఫరా, వినియోగిస్తున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే దీని నిర్మూలను సీఎం రేవంత్ అనేక ప్లాన్ రూపొందించిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు తమ వంతుగా ఈ డ్రగ్స్ నిర్మూలను వ్యతిరేకంగా ప్రచారం చేయాలని షరతు విధించారు. అందుకు లోబడి ప్రతి ఒక్కరూ తమ సినిమాలు రిలీజ్‌కు ముందు ఎదో విధంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ లిస్టులో చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు.
తాజాగా ప్రముఖ నటుడు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ డ్రగ్స్ వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. ‘‘మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?’’ అని ప్రభాస్ ప్రశించారు. డ్రగ్స్‌కు ఎవరైనా బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111కు కాల్ చేయమని డార్లింగ్ హీరో వీడియోలో కోరారు. అంతేకాకుండా డ్రగ్స్ గురించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ప్రభాస్ ఆ వీడియోలో కోరారు.
Also Read: Dil Raju : సినీ పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు రియాక్షన్
#SayNoToDrugs, says #Prabhas pic.twitter.com/A2jgdd2DKE
— Aakashavaani (@TheAakashavaani) December 31, 2024
రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ షూటింగ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ కొన్నిరోజులు షూటింగ్స్‌కు బ్రేక్ తీసుకోనున్నారట. న్యూ ఇయర్ సందర్భంగా ఇటలీ వెళ్లి అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు టాక్. అక్కడే కొద్దిరోజులు రెస్ట్ తీసుకొనున్నారని తెలుస్తోంది.