Site icon HashtagU Telugu

Prabhas Kannappa : ప్రభాస్ ది మరీ ఇంత జాలి హృదయమా.. ఫ్రెండ్ షిప్ కోసం ఇంత చేస్తున్నాడా..?

Prabhas Kannappa doing without Remuneration

Prabhas Kannappa doing without Remuneration

Prabhas Kannappa రెబల్ స్టార్ ప్రభాస్ పరిచయం ఉన్న ఎవరైనా సరే అతని దయా హృదయం గురించి మాట్లాడుకుంటారు. టాలీవుడ్ హీరోలందరిలో ప్రభాస్ అంత మంచోడు లేడని కొందరు చెబుతుంటారు. ప్రభాస్ కైండ్ హర్ట్ గురించి అతనితో స్నేహం చేసిన వారు ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

We’re now on WhatsApp : Click to Join

ఇక ప్రభాస్ తో ఉంటే తిండికి లోటుండదని కడుపునిండా రకరకాల ఐటెంస్ తో భోజనం పెడతాడని అంటుంటారు. ప్రభాస్ తో పనిచేసిన ఎవరైనా సరే అతను పెట్టే భోజనం చూసి షాక్ అవుతారు.

ఇక ఫ్రెండ్ షిప్ కోసం ప్రభాస్ ఏదైనా చేస్తాడు. తనకు వచ్చిన ఈ పాన్ ఇండియా క్రేజ్ మరొకరికి ఉపయోగపడుతుంది అంటే ఎలాంటి మొహమాటం లేకుండా సపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ పనిచేస్తున్నాడట. అతనికి ఉన్న బిజీ షెడ్యూల్ లో కూడా స్నేహితుడికి మాట ఇచ్చాం కాబట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్.

అంతేకాదు ఈ సినిమా కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా పనిచేస్తున్నాడని టాక్. మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ లో కన్నప్పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో అతను ప్రభాస్ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండానే అదే ప్రభాసే పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తారు. మంచు విష్ణు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ కన్నప్ప సినిమాతో మంచు విష్ణు ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read : 69th Film Fare Awards : యానిమల్ కి రణ్ బీర్ బెస్ట్ యాక్టర్.. 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన..!