ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 1000 కోట్ల మార్క్ ని దాదాపు రీచ్ అయినట్టే అని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందునుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే సినిమా ప్రమోషన్స్ సరిగా చేయలేదని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వైజయంతి బ్యానర్ మీద, నాగ్ అశ్విన్ (Nag Aswin) గురించి సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ పెట్టారు. కానీ వాటన్నిటికీ సినిమాతోనే ఆన్సర్ ఇచ్చారు.
కల్కి సినిమా విజయం రెబల్ స్టార్ ప్రతి అభిమాని ఫెస్టివల్ చేసుకునేలా చేశారు. ఐతే కల్కి 1 ఇలా ఉంటే కల్కి 2 దీనికి మించి ఉంటుందని తెలుస్తుంది. కల్కి ఎఫెక్ట్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాల మీద ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ నుంచి నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ (Raja Saab) సినిమా బిజినెస్ మీద ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాజా సాబ్ ఈమధ్య కాలంలో ప్రభాస్ నుంచి వస్తున్న లో బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ అది డైరెక్టర్ మారుతికి మెగా బడ్జెట్ సినిమానే కానీ ప్రభాస్ సినిమా చేస్తే 200, 300 కోట్లు అంటున్నాడు కదా అలా కాకుండా సినిమా మొత్తం 150 కోట్లకు అటు ఇటుగానే పూర్తి చేస్తున్నారట.
ఐతే పెట్టిన బడ్జెట్ కి వస్తున్న బిజినెస్ (Raja Saab Business) కు సంబంధమే లేదన్నట్టు ఉందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తున్న ఈ రాజా సాబ్ సినిమాపై ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుందని తెలుస్తుంది.
సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ తో రాజా సాబ్ వస్తుంది. సినిమా బిజినెస్ అదరగొట్టేస్తుండగా రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో సూపర్ హిట్ పక్కా అనేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : Venkatesh Romance with Two Heroines : వెంకటేష్ తో ఆ ఇద్దరు భామల రొమాన్స్..!