Site icon HashtagU Telugu

Prabhas Kalki : కల్కి పై క్లారిటీ రావాల్సిందే..!

Prabhas Kalki will Come in 9 Parts Nag Aswin Huge Planning

Prabhas Kalki will Come in 9 Parts Nag Aswin Huge Planning

Prabhas Kalki ఏప్రిల్ 5న రిలీజ్ అని సినిమా మొదలు పెట్టిన రోజే ప్రకటించిన ఎన్.టి.ఆర్ దేవర టీం ఇప్పుడు ఆ రోజు రావడం లేదని తెలుస్తుంది. ఇన్నాళ్లు టీం స్పందించలేదని చెప్పుకున్నా ఫైనల్ గా ఏప్రిల్ నుంచి సినిమాను అక్టోబర్ కి రిలీజ్ వాయిదా వేశారు. అక్టోబర్ 10 దసరా రేసులో దేవర వస్తుంది. ఇక దేవర విషయంలో కన్ ఫ్యూజన్ క్లియర్ అయ్యింది. ఎటొచ్చి సమ్మర్ కి రాబోతున్న మరో పెద్ద సినిమా కల్కి విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా 500 కోట్ల పైగా బడ్జెట్ తో వస్తుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేయగా అనుకున్న డేట్ కే దించాలని ప్లాన్ చేస్తుండగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని టాక్.

అయితే ప్రభాస్ సినిమా సమ్మర్ కి వస్తుందా లేదా అన్నది త్వరగా డిసైడ్ చేస్తే ఆ టైం లో మరికొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రభాస్ కల్కి రిలీజ్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ లాంటి దిగ్గజ నటులు కూడా భాగం అవుతున్నారు.

Also Read : Hanuman : హనుమాన్ ఇంకా రేసులో ఉంది.. స్టార్ సినిమాలు కూడా ఈ రేంజ్ ప్లాన్ లేదు..!