Kalki 2898AD : 6000 సంవత్సరాల కథ కల్కి.. ప్రభాస్ కల్కి 2898AD కథని రివీల్ వచ్చేసిన దర్శకుడు..

తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఓ ఇంటరాక్షన్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 03:17 PM IST

ప్రభాస్(Prabhas) ఇటీవలే సలార్ సినిమాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ మే 9న కల్కి 2898AD సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని ఎదురు చూస్తున్నారు.

కల్కి 2898AD సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకొక వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఓ ఇంటరాక్షన్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా మహాభారతం సమయంలో మొదలయి 2898లో ముగుస్తుంది. అందుకే ఈ సినిమాకు టైటిల్ కల్కి 2898AD అని పెట్టాము. 6000 సంవత్సరాల మధ్య జరిగే కథగా ఉంటుంది. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా రాబోతుంది. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుందా అని ఓ ఊహా ప్రపంచాన్ని కూడా సృష్టించాం. ఇండియన్ నేటివిటీతోనే ఈ సినిమా ఉండబోతుంది అని తెలిపారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Also Read : Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక