Prabhas Kalki 2898 AD : ఇంతకీ కల్కి లో విలన్ ఎవరు.? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..?

Prabhas Kalki 2898 AD ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి. ప్రచార చిత్రాలతోనే సినిమాపై భారీ హైప్ తెస్తుండగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో

Published By: HashtagU Telugu Desk
Prabhas Kalki 2898AD Release Confusion Continues

Prabhas Kalki 2898AD Release Confusion Continues

Prabhas Kalki 2898 AD ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి. ప్రచార చిత్రాలతోనే సినిమాపై భారీ హైప్ తెస్తుండగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. టైం ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమా లో ప్రభాస్ కి జోడీగా దీపిక పదుకొనె నటిస్తుంది. సినిమాలో దిశా పటాని, అమితాబ్ తో పాటుగా కమల్ హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

మొన్నటిదాకా కల్కి లో కమల్ హాసన్ విలన్ అని అందరు అనుకున్నారు. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ కల్కి సినిమా గురించి చెబుతూ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేశానని అన్నారు. ప్రభాస్ కల్కిలో కమల్ హాసన్ అతిథి పాత్ర మాత్రమే అని చెప్పేసరికి ఆడియన్స్ లో డౌట్లు మొదలయ్యాయి. ఇంతకీ ప్రభాస్ కల్కిలో విలన్ ఎవరు.. ప్రతి నాయకుడి గురించి ఎందుకు అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు అన్నది ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఏర్పడుతుంది.

హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా కల్కి ఉండబోతుందని తెలుస్తుంది. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. అసలైతే సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేసినా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వల్ల సినిమా వాయిదా పడుతుందని తెలుస్తుంది.

Also Read : Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ సినిమా అన్ని గంటలు చూస్తారా.. ఫ్యామిలీ స్టార్ రన్ టైమ్ షాక్..!

  Last Updated: 30 Mar 2024, 10:38 AM IST