Site icon HashtagU Telugu

Kalki 2898 AD : సినిమా రిలీజ్ కంటే ముందే.. కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్..!

Prabhas Kalki 2898 Ad Is Come With Animated Web Series Before Movie Release

Prabhas Kalki 2898 Ad Is Come With Animated Web Series Before Movie Release

Kalki 2898 AD : ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా టాలీవుడ్ తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా జూన్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా కంటే ముందే కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుందట. ఈ యానిమేషన్ సిరీస్ కి మూవీకి కనెక్షన్ ఉంటుందట.

కల్కి సినిమా కథకి సంబంధించిన ముందు కథని ఈ యానిమేషన్ వెబ్ సిరీస్ తో మేకర్స్ ఆడియన్స్ కి చెప్పబోతున్నారట. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ ఉండబోతుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ ఎండింగ్.. కల్కి మూవీకి బిగినింగ్ అంట. కాబట్టి సినిమా స్టార్టింగ్ అర్థంకావాలంటే.. ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాలసిందే. ఈ వెబ్ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయనున్నారట. మే 25 తరువాత ఈ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 20 నిముషాలు పైనే ఉంటుందట. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ టీజర్ ఏమో 1 నిమిషం 12 సెకన్స్ తో ఆడియన్స్ ముందుకు రానుందట. మరి ఈ టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ వెబ్ సిరీస్ తో పాటు మూవీ నుంచి ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానితో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ కూడా కనిపించబోతున్నారు. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Also read : Rakhi Sawant: తీవ్ర గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్