Prabhas Japan Fans : జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు.. ప్రభాస్ కి దండేసి, ప్రసాదాలు పెట్టి..

ప్రభాస్ అభిమానులు రకరకాల కార్యక్రమాలతో ప్రభాస్ పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారు. మన ఇండియన్ అభిమానులని మించిపోయి మరీ జపాన్ అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Prabhas Japan Fans Celebrating his Birthday Grand Level

Prabhas Japan Fans Celebrating his Birthday Grand Level

బాహుబలి(Bahubali) స్టార్, డార్లింగ్ ప్రభాస్(Prabhas) పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాతో ముఖ్యంగా జపాన్(Japan) లో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటికే అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ప్రభాస్ అభిమానులు రకరకాల కార్యక్రమాలతో ప్రభాస్ పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారు. మన ఇండియన్ అభిమానులని మించిపోయి మరీ జపాన్ అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నారు. జపాన్ లో పలువురు ప్రభాస్ అభిమానులు ఆయన పుట్టిన రోజుని పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఒక రూమ్ నిండా ప్రభాస్ కటౌట్స్ పెట్టి, ప్రభాస్ బొమ్మలు పెట్టి, వాటికి పూల దండలు వేసి, బర్త్ డే డెకరేషన్స్ చేసి మన తెలుగు ప్రసాదాలు పులిహార, కేసరి, గారెలు లాంటివి వండి దేవుడికి పెట్టినట్టు నైవేద్యం పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు కూడా అచేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మహిళా అభిమానులు ఉండటం విశేషం. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మనమే అభిమానం చూపించడంలో వేరే లెవల్ అనుకుంటే ఈ జపాన్ వాళ్ళు మనల్ని మించిపోయారుగా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ పుట్టిన రోజు ఇక్కడ ఇండియాలోనే కాక ప్రపంచమంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

 

Also Read : Prabhas : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ స్టోరీ..

  Last Updated: 23 Oct 2023, 06:10 AM IST