Site icon HashtagU Telugu

Darling Prabhas: సలార్ టీమ్ కు ప్రభాస్ అదిరిపోయే గిఫ్టులు, రియల్ హీరో అంటూ ప్రశంసల జల్లు!

Salaar Teaser

Salaar

కేజీఎఫ్ ఫేం, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ కాంబినేషన్ లో సలార్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న ఈ మూవీ దాదాపుగా పూర్తైందని సమాచారం. చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయాల్సి ఉంది. హీరో ప్రభాస్ తన కోస్టార్స్ తో పాటు చిత్ర యూనిట్ తో సన్నిహితంగా ఉంటారు. హీరోయిజం పక్కన పెట్టి ఓ కామన్ మేన్ లా కిందిస్థాయి సిబ్బందితో కలిసిపోతారు. అందుకే ప్రతిఒక్కరూ ప్రభాస్ ను ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సలార్ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికి ఊహించనివిధంగా సరప్రైజ్ ఇచ్చాడు.

ఎంతో కష్టపడిన పనిచేసిన టెక్నీషియన్స్ కు (చిత్ర యూనిట్)  బ్యాంక్ అకౌంట్స్ కు రూ.10,000 ట్రాన్స్ ఫర్ చేశాడు. దీంతో సలార్ సిబ్బంది ప్రభాస్ ను రియల్ హీరోని పొగిడేస్తున్నారు. ఈ వార్త అభిమానులను ఖచ్చితంగా సంతోషపెట్టినప్పటికీ, సలార్ అప్‌డేట్‌ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో చాలారోజులుగా ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్  డిమాండ్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ తమ ట్విట్టర్ ను డియాక్టివేట్ చేశారంటే సలార్ కోసం అభిమానుల ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్దమవుతోంది.

సాలార్ రిలీజ్ డేట్ వాయిదా పడిందనే పుకార్లు షికారు చేశాయి. అయితే ఆ తర్వాత సెప్టెంబర్ 28 న విడుదల కానుందని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయిక. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా వర్ధరాజ మన్నార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో జగపతి బాబు, మధు గురుస్వామి, మరియు ఈశ్వరీ రావు ఇతర పాత్రలు కాకుండా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రాజెక్ట్‌కి హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: Prashanth Reddy: గుండె ఆపరేషన్ కోసం 3 లక్షల అందజేత