Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం ప్రభాస్.. మేజర్ పోర్షన్ పూర్తి చేసేలా ప్లానింగ్..!

Raja Saab ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు మారుతి. మొన్నటిదాకా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫస్ట్ టైం చేస్తున్న

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 11:59 AM IST

Raja Saab ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు మారుతి. మొన్నటిదాకా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాతో డైరెక్టర్ గా తన రేంజ్ కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఓ పక్క కల్కి కోసం ఇన్నాళ్లు తన డేట్స్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్ రాజా సాబ్ మీద పెట్టాలని నిర్ణయించుకున్నాడట. రాజా సాబ్ సినిమా కోసం ఏప్రిల్ నెల మొత్తం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో మేజర్ పోర్షన్ ని ఏప్రిల్ లో పూర్తి చేసేలా మారుతి ప్లాన్ చేశాడట. సో అందుకు తగినట్టుగా తన డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు ప్రభాస్.

కల్కి సినిమా మే 9న వచ్చినా రాకపోయినా రాజా సాబ్ మాత్రం 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాజా సాబ్ పూర్తి చేసి సందీప్ వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ టైం ఇస్తున్నాడని తెలుస్తుంది. స్పిరిట్ తో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 ని కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.

Also Read : Krithi Sanon Dating : 10 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్.. ప్రభాస్ తో లవ్ స్టోరీ అని ఇప్పుడు ఇలా ఏంటి..?