Prabhas Fauji : సైలెంట్ గా ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ ప్రారంభం

సీతారామం ఫేమ్ హనురాఘవాపుడి డైరెక్షన్లో 'ఫౌజీ' అనే చిత్రం చేయబోతున్నాడు. ఈ మూవీ తాలూకా ఓపెనింగ్ కార్యక్రమాలు ఈరోజు చాల సింపుల్ గా జరిగాయి

Published By: HashtagU Telugu Desk
Prabhas Fauji

Prabhas Fauji

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేసేందుకు సై అంటున్నాడు. రీసెంట్ గా సలార్, కల్కి బ్లాక్ బస్టర్ హిట్స్ పడడంతో వరుసగా కథలు వింటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో రాజాసాబ్ చేస్తూనే..ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సీతారామం ఫేమ్ హనురాఘవాపుడి డైరెక్షన్లో ‘ఫౌజీ’ (Fauji) అనే చిత్రం చేయబోతున్నాడు. ఈ మూవీ తాలూకా ఓపెనింగ్ కార్యక్రమాలు ఈరోజు చాల సింపుల్ గా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ హను, హీరో ప్రభాస్‌తో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఇక నెక్ట్స్‌ వీక్‌లోనే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోనుందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ మూవీ లో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో పూజారి తనయుడిగా కనిపిస్తాడని టాక్‌. అలాగే ఈ సినిమాలో పాకిస్థానీ నటి సజల్ అలీ ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా నటించనుందని ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇండియా-పాక్‌ బోర్డర్‌ నేపథ్యంలో ప్రేమకథగా ఈ చిత్రం సాగనుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది మరికొద్ది రోజలు ఆగితే కానీ తెలియదు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.

Read Also : Revanth Reddy : అతి త్వరలో రేవంత్ తన టీం తో కలిసి బీజేపీలో చేరబోతున్నారు – కేటీఆర్

  Last Updated: 17 Aug 2024, 06:32 PM IST