Prabhas Cutout : ప్రభాస్ బర్త్ డే.. అత్యంత ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు.. ఎన్ని అడుగులో తెలుసా?

హైదరాబాద్ లోని పలువురు ప్రభాస్ అభిమానులు నిన్న రాత్రి కూకట్ పల్లి లోని ఖైత్లాపూర్ గ్రౌండ్స్ లో ప్రభాస్ అత్యంత ఎత్తైన కటౌట్(Prabhas Cutout) ని ఏర్పాటు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Prabhas Fans placed 230 feet Biggest Prabhas Cutout in Hyderabad

Prabhas Fans placed 230 feet Biggest Prabhas Cutout in Hyderabad

నేడు డార్లింగ్ ప్రభాస్(Prabhas) పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ అభిమానులు నిన్న రాత్రి నుంచే సంబరాలు చేస్తున్నారు. బాహుబలి(Bahubali) సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచి దేశ, విదేశాల్లో తెలుగు సినిమాకు అభిమానుల్ని, మార్కెట్ ని పెంచిన డార్లింగ్ ప్రభాస్ నేడు 44వ పుట్టిన రోజు చేసుకోబోతున్నాడు. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

ఇక దేశ విదేశాల్లోని అభిమానులు తమకు తోచినట్టు ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని పలువురు ప్రభాస్ అభిమానులు నిన్న రాత్రి కూకట్ పల్లి లోని ఖైత్లాపూర్ గ్రౌండ్స్ లో ప్రభాస్ అత్యంత ఎత్తైన కటౌట్(Prabhas Cutout) ని ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఏకంగా 230 అడుగులతో ఏర్పాటు చేశారు. సలార్ లుక్ తో ఉన్న ప్రభాస్ ఫోటోని హ్యాపీ బర్త్ డే చెప్తూ ఏర్పాటు చేశారు.

దీంతో ఈ ప్రభాస్ కటౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమాల రిలీజ్ ల సమయంలో అభిమానులు తమ హీరోల కటౌట్స్ ఏర్పాటు చేస్తారని తెలిసిందే. మహా అయితే 100 అడుగుల కటౌట్స్ వరకు ఏర్పాటు చేస్తారు థియేటర్స్ వద్ద. కానీ మొదటిసారి ఇంత భారీగా ఒక హీరోకి 230 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయడంతో సరికొత్త రికార్డ్ గా నిలిచింది. ఇక ఈ కటౌట్ ఆవిష్కరణ నిన్న రాత్రి ఘనంగా జరిగింది.భారీగా ప్రభాస్ అభిమానులు వచ్చి సందడి చేశారు.

 

Also Read : Prabhas : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ స్టోరీ..

  Last Updated: 23 Oct 2023, 06:25 AM IST