Prabhas Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ టీజర్ వచ్చేస్తోంది!

మరికొద్ది గంటల్లోనే సలార్ టీజర్ రాబోతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 11:15 AM IST

మరికొద్ది గంటల్లోనే సలార్ టీజర్ రాబోతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతోంది సలార్ సినిమా. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి రేపు టీజర్ రిలీజ్ అవుతోంది. ఈ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు ఉదయం 5 గంటల 12 నిమిషాలకు హోంబలే ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానెల్ లో సలార్ టీజర్ ను లాంఛ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ ను కట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

సలార్ రాకతో ఆదిపురుష్ గాయాన్ని మరిచిపోవాలనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే టీజర్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అటు సలార్ యూనిట్ కూడా సినిమా ప్రమోషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లబోతోంది. టీజర్ తో అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించబోతున్న యూనిట్.. ఆ వెంటనే ప్రచారాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుంది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తోంది సలార్ మూవీ. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.