Prabhas : సలార్ ప్రమోషన్స్ ఎక్కడ.. రెబల్ ఫ్యాన్స్ అప్సెట్ కి కారణాలు ఏంటి..?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్

Published By: HashtagU Telugu Desk
Prabhas Salaar 2 Shelved Rebal Star Fans Dissappointed

Prabhas Salaar 2 Shelved Rebal Star Fans Dissappointed

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచింది. కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ అంటున్నాడు. ప్రభాస్ కూడా సలార్ తో సంచలనానికి సిద్ధమయ్యాడు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సలార్ టీం ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ట్రైలర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చేస్తున్న జాప్యానికి వారు అసంతృప్తిగా ఉన్నారు.

ప్రభాస్ సలార్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా వస్తుంది. ట్రైలర్ లో స్నేహితుడి కోసం ఏదైనా చేసే యోధుడిగా కనిపించాడు ప్రభాస్. డిసెంబర్ 22న రిలీజ్ పెట్టుకున్న టీం ఇంకా ప్రమోషన్స్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అన్న దానిపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ఎంత చేస్తే అంత ఓపెనింగ్స్ తెచ్చే ఛాన్స్ ఉంటుంది.

Also Read : Nani : స్టార్స్ ని వెనక్కి నెట్టి సత్తా చాటుతున్న నాని..!

మరి అలాంటిది సలార్ టీం ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఈ కాంబో సినిమా ఎలా ఉండాలని ఊహించారో దానికి ఏమాత్రం తగ్గకుండా సలార్ ఉంటుందని ట్రైలర్ తోనే అంచనాలు పెంచారు. మరి సలార్ టీం ఇప్పటికైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై బజ్ పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సలార్ సినిమాలో పృధ్వి రాజ్ సుకుమార్ కూడా నటిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 12 Dec 2023, 01:06 PM IST