Malaika Aroras Father : ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి 62 ఏళ్ల అనిల్ మెహతా బుధవారం రోజు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసానికి సంబంధించిన ఆరో అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నారు. అనిల్ మెహతా డెడ్‌బాడీకి నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో(Malaika Aroras Father) కీలక విషయాలు వెల్లడయ్యాయి. శరీరంపై ఒకటికి మించి గాయాలు ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు.
Also Read :Bangladesh Durga Puja: నమాజ్ టైంలో దుర్గాపూజలు చేయొద్దు.. హిందువులకు బంగ్లా సర్కారు ఆర్డర్
అనిల్ మెహతా బిల్డింగ్ పైనుంచి దూకినప్పుడు మలైకా అరోరా తల్లి జాయ్స్ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తులోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. బాల్కనీ నుంచి దూకడానికి కొంతసేపటి ముందు తన కుమార్తెలు మలైకా అరోరా, అమృతలను అనిల్ మెహతా ఇంటికి పిలిపించినట్లు సమాచారం. వారితో ఎమోషనల్‌గా మాట్లాడిన ఆయన.. తాను చాలా అలసిపోయానని చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన భార్య జాయ్స్‌కు అనిల్ మెహతా విడాకులు ఇచ్చారు. అనిల్ మెహతా సూసైడ్ చేసుకున్నప్పుడు మాజీ భార్య జాయ్స్ ఇంట్లో ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
Also Read :Another Pandemic : త్వరలో మహాయుద్ధం.. రాబోయే పాతికేళ్లలో మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ జోస్యం
జాయ్స్‌ను పోలీసులు ప్రశ్నించగా.. ‘‘మా ఇంటి హాలులో అనిల్ మెహతా చెప్పులను చూశాను. ఆయన ఎక్కడికి వెళ్లారు అని వెతికితే.. బాల్కనీ నుంచి అప్పటికే దూకారని తెలిసింది.. ’’ అని ఆమె చెప్పారు. బిల్డింగ్ కాంపౌండులో తన మాజీ భర్త అనిల్ మెహతా విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తాను తట్టుకోలేకపోయినట్లు జాయ్స్ పేర్కొన్నారు. దీనిపై వెంటనే తాను ఇంటి సెక్యూరిటీ గార్డులు, పోలీసులకు సమాచారాన్ని అందించానని తెలిపారు. అనిల్ మెహతా పెద్దగా ఆరోగ్య సమస్యలేవీ లేవని, మోకాళ్ల నొప్పులు మాత్రమే ఉన్నాయని ఆమె చెప్పారు. ఇవాళ ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటికలో అనిల్ మెహతా అంత్యక్రియలు జరగనున్నాయి.