Kiran Abbaram Ka యువ హీరోల్లో కొత్త ప్రయత్నాలతో అలరిస్తూ సత్తా చాటుతున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. రాజా వారు రాణి గారు (Raja varu Rani Garu) సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే అలరించిన కిరణ్ ఎస్.ఆర్ కళ్యాణమండపం తో తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈమధ్యలో చేసిన సినిమాల్లో వినరో భాగ్యము విష్ణు కథ తప్ప మరో సినిమా ఆడలేదు. అయినా సరే మనోడు వెనక్కి తగ్గలేదు.
ప్రస్తుతం క అంటూ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను సుజిత్, సందీప్ అనే దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన క ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. క సినిమాలో కిరణ్ పోస్ట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తేనే కొత్తగా అనిపించింది. అంతేకాదు ఈ సినిమా టైం మిషన్ కాన్సెప్ట్ తో వస్తుందని టాక్.
సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్..
ట్రైలర్ (Ka Trailer) కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి గట్టిగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 31న కిరణ్ అబ్బవరం క సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాను కూడా కిరణ్ (Kiran Abbavaram) భారీగానే ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే కిరణ్ అన్ని లెక్కలు సెట్ చేస్తాడని చెప్పొచ్చు.
ఈమధ్య కొన్ని మొహమాటానికి పోయి సినిమాలు చేశానని చెప్పిన కిరణ్ ఇక మీదత కథల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెబుతున్నాడు. క హిట్ అయితే యువ హీరో కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చినట్టే అవుతుంది.
Also Read : Akira Nandan OG Video : పవన్ కళ్యాణ్ ఓజీలో అకిరా నందన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!