ప్రముఖ మరాఠీ నటి కల్యాణీ కుర్లే జాదవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 32ఏళ్ల కల్యాణాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని కొల్హాపూర్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నటి ప్రయాణిస్తున్న బైక్ సిమెంట్ మిక్సర్ ట్రాక్టర్ ను డీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కల్యాణి కుర్లే జాదవ్ తుజ్యత్ జీవ్ రంగ్లా సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సాంగ్లీ కొల్హాపూర్ హైవేలోని హలోండి చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.