పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి త్రివిక్రమ్(Trivikram)పై కీలక విమర్శలు చేసింది. త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ, మా అసోసియేషన్ ఈ వ్యవహారంలో స్పందించలేదని ఆమె ఆరోపించింది. తాను చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం పట్ల పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసోసియేషన్‌పై విమర్శలు గుప్పించింది.
తాజాగా పూనమ్ చేసిన ట్వీట్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) స్పందించింది. మా ట్రెజరర్ శివబాలాజీ (Shiva Balaji) ఈ విషయమై మీడియాకు క్లారిటీ ఇచ్చారు. పూనమ్ కౌర్ నుంచి ఇప్పటివరకు రాతపూర్వక ఫిర్యాదు రాలేదని, మా టర్మ్ మొదటి నుంచే ఇలాంటి కంప్లైంట్ ఎక్కడా రికార్డులో లేదని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని, న్యాయవ్యవస్థను ఆశ్రయించాలని సూచించారు.
పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని చెబుతూ, త్రివిక్రమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. త్రివిక్రమ్ చేసిన తప్పులు ఏంటో? తనకు జరిగిన అన్యాయం గురించి పూర్తి వివరాలు చెప్పాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. ఈ ఆరోపణలు జల్సా సినిమా టైంలోనే ప్రారంభమైనట్లు పూనమ్ గతంలో ప్రకటించింది. త్రివిక్రమ్‌పై ఆరోపణలు సీరియస్ అయితే, పూనమ్ ఆమె సాక్ష్యాలను బయటపెట్టేనా? లేక, ఈ వ్యవహారం ఇలానే సాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పూనమ్ ట్వీట్లు వైరల్ అవుతుండగా, ఈ వివాదంపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తప్పుచేసిన వారిని ప్రశ్నించాలనే కోణంలో పూనమ్ పోరాడుతోంది. కానీ, మా అసోసియేషన్ తన కంప్లైంట్ లేదు అని చెప్పడంతో వివాదం మరింత ముదురుతోంది. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
Read Also : JC Prabhakar Reddy : ‘‘నేను మాట్లాడింది తప్పే..’’ నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు