Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. తన సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తున్న పూజా హెగ్దే ఏదైనా అకేషన్ వస్తే చాలు తెగ హడావిడి చేసేస్తుంది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పూజా సముద్రపు ఒడ్డున యోగా భంగిమలతో అదరగొట్టేసింది. అసలు అమ్మడి ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేదా స్ప్రింగులా అనిపించేలా అమ్మడు బెండ్ అయ్యింది.
తన నటనతో పాటుగా అందంతో కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న పూజా హెగ్దే హెల్దీగా ఉండేందుకు బాగా కష్టపడుతుంది. సినిమాల గ్యాప్ తో సోషల్ మీడియాలో అమ్మడు పెట్టే ఫోటో షూట్స్ మంచి ఎంటర్టైన్ అందిస్తాయి. తెలుగులో రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా అందుకోని పూజా హెగ్దే నాగ చైతన్య సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్.
ఐతే తెలుగులో అవకాశాలు రాకపోయినా కోలీవుడ్ లో లక్కీ ఆఫర్ పట్టేసింది పూజా హెగ్దే. సూర్య కార్తీక్ సుబ్బరాజు కంబినేషన్ లో వస్తున్న సినిమాలో అమ్మడు నటిస్తుంది. సూర్య 44వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోపక్క హిందీలో కూడా ఒకటి రెండు సినిమాలు చేస్తుంది పూజా హెగ్దే.
Also Read : Prabhas Kalki : రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఒక్కటే.. ఆరోజు మరో సినిమాకు నో ఛాన్స్..?