Site icon HashtagU Telugu

Pooja Hegde : నిమిషానికి లక్ష ఛార్జ్ చేస్తున్న పూజా హగ్దే..వ్యాపారం గట్టిగానే ఉందిగా..!

pooja hegde remuneration per shop opening

pooja hegde remuneration per shop opening

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’. ఇది పెద్దలు ఎప్పుడు చెపుతుంటారు. దీనిని తు.చ.తప్పకుండా సినీ తారలు పాటిస్తారు. చిత్రసీమ అనేది రంగుల ప్రపంచం..ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు..ఒక్క హిట్టే జాతకాన్ని మార్చేస్తుంది..అలాగే ఒక్క ప్లాపే తారలను కిందకు తోచేస్తుంది. అందుకే సినీ తారలు పాపులార్టీ ఉన్నప్పుడే నాల్గు రాళ్లు వెనకేసుకుంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.

చిత్రసీమలో డిమాండ్ ఉన్నప్పుడే భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ..పలు యాడ్స్ , రిబ్బన్ కట్టింగ్ లు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంటారు. ఆ డబ్బుతో పలు వ్యాపారాలు , కార్లు , ఫ్లాట్స్ కొనుగోలు చేసి లైఫ్ సెటిల్ చేసుకుంటారు. ప్రస్తుతం డీజే భామ పూజా హగ్దే (Pooja Hegde) అలాగే డబ్బు సంపాదిస్తుంది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ…ఆ తరువాత డీజే (DJ) మూవీ తో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మార్చుకుంది.

Read Also : National Film Awards: అల్లు అర్జున్ కి సీఎం కేసీఆర్ అభినందనలు

డీజే తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ కెరియర్ ను వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసుకుంది. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారింది. రీసెంట్ గా మాత్రం అమ్మడి ఖాతాలో వరుస ప్లాప్స్ పడ్డాయి. అయినప్పటికీ అమ్మడి క్రేజ్ తగ్గలేదు. పలు యాడ్స్​, షాప్​ ఓపెనింగ్స్​తో బిజీగా గడిపేస్తుంది. ఒక్కో షాప్​ ఓపెనింగ్​కి ఈ భామ​ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ (Pooja Hegde Remuneration )​ అందుకుంటోందని తెలుస్తుంది. నిమిషానికి లక్ష ఛార్జ్ చేస్తుందట. అరగంట సేపు షాప్ ఓపెనింగులో (Shop Opening) ఉంటె రూ.30 లక్షలు సంపాదించినట్లే. రీసెంట్ గా ఓ షాప్ ఓపెనింగ్ లో దాదాపు 40 నిమిషాల పాటు సందడి చేసింది. ఈ 40 నిమిషాల్లో అమ్మడు రూ.40 లక్షలు సంపాదించింది. ఈ విషయం తెలిసి అంత వామ్మో అమ్మడి వ్యాపారమే బాగుందిగా అనినోరు వెళ్లబడుతున్నారు.