Pooja Hegde : ఇంతకీ ఆ సినిమాలో బుట్ట బొమ్మ ఉందా లేదా..?

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో పెద్దగా అవకాశాలను రాబట్టుకోలేకపోతుంది. అమ్మడు గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అవ్వడమే పెద్ద మిస్టేక్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Bad Luck Continues

Pooja Hegde Bad Luck Continues

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో పెద్దగా అవకాశాలను రాబట్టుకోలేకపోతుంది. అమ్మడు గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అవ్వడమే పెద్ద మిస్టేక్ అయ్యింది. ఆ తర్వత ఒక్కటంటే ఒక్క సినిమా పూజా హెగ్దే ఖాతాలో పడలేదు. అక్కడ బాలీవుడ్ లో కూడా అమ్మడికి పెద్దగా ఛాన్సులు రావట్లేదు. ఐతే ఈమధ్య నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది.

కార్తీక్ నాగ చైతన్య కాంబో సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అదే నిజమైతే మాత్రం అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టే లెక్క. బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో ఆఫర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నా అమ్మడిని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. రాధే శ్యాం వరకు వరుస స్టార్ సినిమాలతో సత్తా చాటిన పూజా బేబీ ఇప్పుడు అవకాశాలు లేక డీలా పడిపోయింది.

బాలీవుడ్ లో వస్తున్న అరకొర అవకాశాలతోనే అమ్మడు కెరీర్ లాగిస్తుంది. ఐతే కోలీవుడ్ లో సూర్య సరసన ఛాన్స్ అందుకుంది పూజా హెగ్దే. సూర్య 44వ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా ఓకే అయ్యింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. చైతన్య తో ఒక లైలా కోసం సినిమా చేసిన పూజా హెగ్దే మళ్లీ ఇన్నాళ్లకు అతనితో జత కడుతుంది. కచ్చితంగా ఈ జోడీ అక్కినేని ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.

Also Read : Megastar Chiranjeevi : చిరుతో నాగ్ అశ్విన్.. ఊహలకు కూడా అందని సినిమా..?

  Last Updated: 03 Jul 2024, 11:27 AM IST