Site icon HashtagU Telugu

Pooja Hegde : పింక్ డ్రెస్ లో జిగేల్ అనిపిస్తున్న ‘జిగేల్ రాణి’

Pooja Pink

Pooja Pink

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజ హెగ్డే(Pooja Hegde)కి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్లిన ఈ భామకు ఇటీవల వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. రాధే శ్యామ్ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఆచార్య, బీస్ట్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, సర్కస్, దేవా వంటి చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో పూజ హెగ్డేకు “గోల్డెన్ లెగ్” అనే ట్యాగ్ కాస్తా “ఐరన్ లెగ్”గా మారిపోయింది. అయితే పూజ కెరీర్‌కు ఊపునిచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని భావించినా, గుంటూరు కారం నుంచి పూజ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Yo-Yo Score: ఫిట్‌నెస్ విష‌యంలో విరాట్ కోహ్లీకి చెక్ పెట్టిన తెలుగు కుర్రాడు.. యో-యో స్కోర్ ఎంతంటే?

తెలుగులో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ, కోలీవుడ్‌లో పూజ హెగ్డే (Pooja Hegde) బిజీగా మారింది. సూర్య, విజయ్, రజినీకాంత్ వంటి టాప్ హీరోల సినిమాల్లో ఆమె నటించే అవకాశం దక్కించుకుంది. విజయ్ చివరి చిత్రం జననాయకన్ చిత్రంలో పూజ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే సూర్య తాజా చిత్రం రెట్రోలో కూడా పూజ నటిస్తోంది. మరోవైపు, రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ చిత్రంలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు సమాచారం. అంతేకాదు రాఘవ లారెన్స్‌తో కలిసి కాంచన 4 చిత్రంలోనూ ఆమె నటించనుంది.

Goodbye to Pawan’s Films : ‘OG ‘ నే పవన్ లాస్ట్ సినిమానా..?

సినిమాల్లో కాస్త గ్యాప్ వచ్చినా సోషల్ మీడియాలో మాత్రం పూజ హెగ్డే (Pooja Hegde) సందడి చేస్తూనే ఉంది. తాజా ఫొటోషూట్‌లో ఆమె పింక్ చోళీ లెహంగాలో మెరిసిపోతూ అభిమానులను మంత్ర ముగ్దులను చేసింది. పింక్ డ్రెస్‌లో పూజ హెగ్డే గ్లామర్ హంగులతో అదరగొడుతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రతి రోజు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ, స్టన్నింగ్ లుక్స్‌లో కనిపిస్తూ పూజ అభిమానులను కనువిందు చేస్తోంది. కొత్త ఆఫర్లు, క్రేజీ ప్రాజెక్టులతో మళ్లీ పూజ హెగ్డే సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? లేదా అన్నది చూడాలి.