Pooja Hegde : టిల్లు క్యూబ్ లో పూజా హెగ్డే.. స్టార్ బోయ్ సిద్ధు ప్లానింగ్ అదుర్స్..!

Pooja Hegde డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టి టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు చెప్పి మరీ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నాడని తెలిసిందే. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టి టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు చెప్పి మరీ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నాడని తెలిసిందే. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హిట్ కాగా టిల్లు స్క్వేర్ సినిమా భారీ అంచనాలతో వచ్చి సక్సెస్ అయ్యింది. టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ కూడా సినిమా సక్సెస్ కు కారణమైంది. టిల్లు స్క్వేర్ హిట్ తో టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ.

టిల్లు క్యూబ్ సినిమా కోసం కథని సిద్ధం చేసే పనుల్లో ఉన్నాడు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ జాక్, తెలుసుకదా సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతనే టిల్లు క్యూబ్ ఉండే అవకాశం ఉంది. అయితే టిల్లు క్యూబ్ సినిమాలో కాస్టింగ్ ని సెలెక్ట్ చేస్తున్నారని టాక్. టిల్లు క్యూబ్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటిస్తుందని చెబుతున్నారు.

తెలుగులో మొన్నటిదాకా స్టార్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దే ఇప్పుడు ఇక్కడ ఛాన్సులు లేక ఖాళీ అయ్యింది. నాగ చైతన్యతో కార్తీక్ దండు డైరెక్షన్ లో సినిమాలో పూజా సెలెక్ట్ అయినట్టు టాక్. ఇక సిద్ధు చేయబోతున్న టిల్లు క్యూబ్ లో పూజాని తీసుకుంటున్నారట.

పూజాకు ఉన్న హాట్ ఫాలోయింగ్ కు సిద్ధుతో అనుపమ చేసిన రేంజ్ లో రొమాన్స్ చేస్తే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. సిద్ధు పూజా హెగ్దే ఈ కాంబోలో టిల్లు క్యూబ్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ అందించడం పక్కా అంటున్నారు.

Also Read : Vijay Devarakonda : బాలకృష్ణ కాదు రౌడీ హీరోని లైన్ లో పెడుతున్న డైరెక్టర్..!

  Last Updated: 02 May 2024, 02:47 PM IST